మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో చాలా పేరుండేది. కానీ, ఇప్పుడంతటి క్రేజ్ లేదు. రైజింగ్‌లో లేని మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం మణిశర్మ. కానీ, ఇటీవల 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మణిశర్మని మళ్లీ ఆడియన్స్‌కి గుర్తు చేసింది. ఈ మధ్య వచ్చిన ఏ సినిమా ఆడియో, 'ఇస్మార్ట్ శంకర్' మ్యూజిక్‌ని బీట్ చేయలేకపోయింది. ఆ రేంజ్‌లో మణిశర్మ బాణీలు దడ దడలాడించేశాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఊపు ఊపేశాయి. దాంతో మళ్లీ మణిశర్మ ఫామ్‌లోకి వచ్చాడనిపించింది.
ఈ క్రమంలోనే, మణిశర్మ ఖాతాలో మెగా ఆఫర్ వచ్చి చేరింది. కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి మణిశర్మని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. గతంలో చిరంజీవి - మణిశర్మ కాంబినేషన్‌లో బోలెడన్ని సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. 'చూడాలని ఉంది', 'అన్నయ్య', 'ఇంద్ర'.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు పెద్దదే ఉంటుంది మెలోడి బ్రహ్మ కాంబినేషన్‌లో చిరంజీవి హిట్ ఆల్బమ్స్. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ ఇలా సెట్ అయ్యింది.
మెగాస్టార్ కోసం మ్యూజిక్ ప్రిపేర్ చేయడమంటే, ఏ మ్యూజిక్ డైరెక్టర్‌కైనా పూనకం రావాల్సిందే. అలాంటిది మణిశర్మలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే, ఆ రేంజే మరోలా ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్‌తో ఇస్మార్ట్ హిట్ కొట్టి, ఇస్మార్ట్ జోష్ మీదున్న మణిశర్మ మెగాస్టార్ కోసం ఎలాంటి ఇస్మార్ట్ ఆల్బమ్‌ని సిద్దం చేస్తాడో చూడాలిక.