కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని థియేటర్లోనే చూడాలి. కొన్ని కధలు వెండితెరపైనే బావుంటాయి. కొంతమంది దర్శకులు.. కేవలం సిల్వర్ స్క్రీన్ కోసమే పుడతారు. ఇందులో మణిరత్నం పేరు ముందు వరసలో ఉంటుంది. ఐతే కాలం మారింది. భవిష్యత్ సినిమా.. ఓటీటీ దే అని కమల్ హాసన్ లాంటి వాళ్ళు పదేళ్ల క్రితమే చెప్పారు. ఇప్పడు కరోనా వల్ల సినిమాతో కనెక్షన్ లేని వాళ్ళు కూడా ''సినిమా కోసం థియేటర్ వరకూ అవసరమా ?'' అనే ఆలోచన చేస్తున్నారు. దింతో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి స్థంస్థలకు బంగారు భవిష్యత్ కనిపిస్తుంది.
ప్రతి ఫిల్మ్ మేకర్ ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఐతే మణిరత్నం మాత్రం.. తాను ఎట్టి పరిస్థితిలో వెబ్ కోసం సినిమా తీయబోనని చెప్పేశారు. '' నా సినిమాలు థియేటర్ లో చూసినంతగా టీవీలో చూడరు. ఇది నేను గమనించాను. నా సినిమాలకు మాంచి టీఆర్పీ వచ్చినట్లు ఎక్కడా వినలేదు. సో.. వెండితెర కోసమే సినిమా తీస్తాను. లేదంటే సినిమాలే మానేస్తాను'' అని క్లియర్ గా చెప్పేశారు మణిరత్నం. నిజమే... మణిరత్నం నిర్ణయం మంచిదే. ఆయన సిల్వర్ స్క్రీన్ సైంటిస్ట్. వెబ్ సిరీస్ లు తీయడానికి చాలా మంది వున్నారు. కానీ ఆయన వెండితెర కోసం సినిమా తీస్తేనే అందమని ఆయన అభిమానుల ఉద్దేశం కూడా.