హోరెత్తిస్తున్న బాణీ.. త‌న ప‌వ‌ర్ చూపించిన‌ మ‌ణి

By iQlikMovies - June 08, 2019 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

ఒక‌ప్పుడు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాల‌కు సంగీతం అందించి స్టార్ మ్యూజిక్‌డైరెక్ట‌ర్‌గా చ‌లామ‌ణీ అయ్యాడు మ‌ణిశ‌ర్మ చిరంజీవి నుంచి వెంక‌టేష్ వ‌ర‌కూ మ‌హేష్ నుంచి ఎన్టీఆర్ వ‌ర‌కూ... అన్నిట్లోనూ మ‌ణి పేరే మెరిసేది. టాప్ హీరోల సూప‌ర్ హిట్ సినిమాల్లో త‌న‌కంటూ ఓ వాటా సంపాదించేసుకున్నాడు మ‌ణి. అయితే త‌మ‌న్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ లాంటి యువ జోరులో.. మ‌ణి ప్రాభ‌వం చాలా త‌గ్గింది. అవ‌కాశాలు త‌క్కువై, వ‌చ్చినా అందులో త‌న‌దైన మ్యాజిక్ చూపించ‌లేక - మ్యూజిక్ డైరెక్ట‌ర్ల రేసులో బాగా వెనుక‌బ‌డిపోయాడు. అయితే.. `ఇప్ప‌టికీ నాలో స‌త్తా త‌గ్గ‌లేదు. నాదంటూ ఓ రోజు మ‌ళ్లీ త‌ప్ప‌కుండా వ‌స్తుంది` అని మ‌ణి గ‌ట్టిగా చెప్పేవాడు.

 

అది `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో వ‌చ్చేస్తోందేమో అనిపిస్తోంది. పూరి - రామ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. పూరి - మ‌ణిది విజ‌య‌వంత‌మైన జోడీ. వీరిద్ద‌రి కాంబోలో చిరుత‌, పోకిరిలాంటి సూప‌ర్ హిట్లున్నాయి. చాలాకాలం త‌ర‌వాత వీరిద్ద‌రి జోడీ మ‌రోసారి కుదిరింది. ఈ సినిమా నుంచి తొలి పాట శ్రోత‌ల ముందుకొచ్చింది. హైద‌రాబాదీ ఫోక్‌లో, డీజేకి బాగా ఉప‌యోగ‌ప‌డే బాణీతో మాస్‌ని మైమ‌ర‌పిస్తున్నాడు మ‌ణి. యూత్ ఫుల్ బాణీలు ఇప్పికీ త‌న ద‌గ్గ‌రున్నాయ‌ని, మాస్‌ని హుషారెత్తించ‌గ‌ల‌న‌ని ఈ బానీతో నిరూపించుకున్నాడు. మ‌ణి శ‌ర్మ మెలోడీల‌కు ప్ర‌సిద్ది. ఈ సినిమాలో అలాంటి ఓ అంద‌మైన మెలోడీ కూడా ఉంద‌ట‌. వాటితో పాటు మిగిలిన పాట‌లూ క్లిక్ అయితే.. మ‌ణి ఈజ్ బ్యాక్ అనుకోవొచ్చేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS