ఆ రీమేక్‌లో వెంకీ కన్‌ఫామ్‌!

మరిన్ని వార్తలు

ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై పోజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకున్న 'దే దే ప్యార్‌ దే' సినిమా రీమేక్‌ హక్కుల్ని సురేష్‌ బాబు సొంతం చేసుకున్నారన్న ప్రచారం నిజమే అని తేలిపోయింది. ఈ రీమేక్‌ హక్కుల్ని వెంకీ కోసమే, సురేష్‌ బాబు తీసుకున్నారట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఫ్యామిలీ కామెడీ చిత్రాలకు వెంకీ పెట్టింది పేరు. అయితే, ఈ మధ్య వయసుకు తగ్గ పాత్రలతో విలక్షణంగా ఆకట్టుకుంటున్న వెంకీ, ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో వెంకీ ఈజ్‌ బ్యాక్‌ అని సంకేతాలు పంపించారు. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో ఆయనను ఇదివరకటిలానే ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ చేస్తున్నారనే భావన కలిగిన దర్శక, నిర్మాతలు వెంకీపై అదే తరహా కథలను సృష్టిస్తున్నారు.

 

ఈ దిశగా వెంకీ ఇప్పటికే మూడు సినిమాలు ఓకే చేసేశారట. ప్రస్తుతం 'వెంకీ మామ' సినిమాలో నటిస్తున్న వెంకటేష్‌, తర్వాత జస్ట్‌ ఏ స్మాల్‌ బ్రేక్‌ తీసుకుని ఈ మూడు ప్రాజెక్టులూ పట్టాలెక్కిస్తారట. అందులో ఒకటి 'దేదే ప్యార్‌ దే' రీమేక్‌ అనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి డైరెక్టర్‌ ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు. ఏది ఏమైతేనేం, ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ వెంకీకి కన్‌ఫామ్‌ కావడంతో, వెంకీ సరసన హీరోయిన్లుగా నటించే ఆ సీనియర్‌, జూనియర్‌ ముద్దుగుమ్మలు ఎవరా.? అనే విషయమై ఆశక్తికరమైన చర్చ మొదలైపోయింది. మరోవైపు వెంకీ ఓకే చేసిన ప్రాజెక్టుల లిస్టులో నక్కిన త్రినాధరావు, తరుణ్‌ భాస్కర్‌ డైరెక్టర్స్‌గా ఉన్నారు. వీటిలో ఏ సినిమా మొదట పట్టాలెక్కుతుందో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS