బీచ్‌లో అందాలారేస్తోన్న 'అల్లరి' భామ

మరిన్ని వార్తలు

'సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మంజరీ ఫడ్నీస్‌. ఆ తర్వాత 'శుభప్రదం', 'ఇంకోసారి' తదితర చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో 'శక్తి' సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో కాసేపు కనిపించింది కూడా. యాక్టింగ్‌లో ఫర్వాలేదనిపిస్తుంది. గ్లామర్‌కీ పెద్దగా హద్దులేమీ ఉండవు. కానీ తెలుగులో హీరోయిన్‌గా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో ఈ బ్యూటీ తాజాగా 'బాబా బ్లాక్‌ షిప్‌' అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో కూడా మంచి ఆఫర్స్‌ వస్తే చేయడానికి రెడీ అంటోంది. ఇప్పటికైతే ఈ బ్యూటీ బీచ్‌ సొగసులను ఆస్వాదిస్తూ ఇదిగో ఇలా కెమెరాకి చిక్కింది. బీచ్‌ సొగసులను అమ్మడు ఆస్వాదిస్తుంటే, అమ్మడి హాట్‌ హాట్‌ సొగసులను మనల్ని ఆస్వాదించమంటోంది. అందుకే ఈ తాజా పిక్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి అందాల మంజరీ మురిసిపోతోందిలా..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS