'అవంతికా' పేరుకీ, తీరుకీ అస్సలు పొంతన లేదండోయ్.! కానీ, సీనియర్ నటి లక్ష్మీతో అబ్బా పేరే ఎంత వినసొంపుగా ఉంది. పేరులాగే అమ్మాయి కూడా పద్ధతిగా ఉంది.. అని చెప్పించుకుంది. కానీ, అదే నిజమనుకుంటే తప్పులో కాలేసినట్లేనండోయ్. పేరులో 'యు' సర్టిఫికెట్ ఉంది కానీ, తీరు మాత్రం 'ఎ' సర్టిఫికెటే. ఈ ఇంట్రడక్షన్ అంతా దేని కోసమంటే.. రకుల్ నటిస్తున్న 'మన్మధుడు 2' సినిమా కోసం. ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరే 'అవంతికా'.
ఆమె ఇంట్రడక్షన్ టీజర్ సారాంశమే ఇదంతా. టీజర్‌పై ఓ లుక్కేస్కోండి. అవంతికా ఇచ్చే కిక్ పొందండి. మొన్న మన్మధుడుగా నాగార్జున రా'కింగ్' టీజర్ చూసేశాం. ఇప్పుడు రా'క్వీన్' అవంతికా టీజర్‌ని ఎంజాయ్ చేయమని లేటెస్ట్‌గా చిత్ర యూనిట్ ఈ టీజర్ వదిలింది. మొదట పద్ధతిగా కనిపించిన అవంతిక తర్వాత పద్థతి వదిలేసింది. ఎక్స్‌పోజింగ్, స్మోకింగ్.. గట్రా చేసేస్తోంది. అంతేకాదు, తన గురించి తానే హింట్ ఇచ్చేసింది. ఇంతవరకూ యూ సర్టిఫికెట్ ప్రదర్శించాను. ఇక నుండి ఎ సర్టిఫికెట్ చూపిస్తాను అంటూ.
ఈ టీజర్ వచ్చాక 'మన్మధుడు 2'లో రకుల్ క్యారెక్టర్ డీటెయిల్స్ ఏంటో అర్ధమైనట్లే అనిపిస్తోంది. ఏది ఏమైనా రకుల్, నాగ్ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉంది. మధ్య మధ్యలో నాగ్‌ని రకుల్ టీజ్ చేయడం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మొత్తానికి 'రెండో మన్మధుడు' యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనదగ్గ సినిమాగానే ప్రచార చిత్రాల ద్వారా అవగతమవుతోంది. ఇక ఫైనల్‌గా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఏ డోస్‌లో ఫ్యాన్స్‌కి కనెక్ట్ అయ్యిందనేది తెలియాలంటే ఆగస్ట్ 9 వరకూ ఆగాల్సిందే.