చిరు - త్రివిక్ర‌మ్‌.... మ‌ధ్య‌లో ఎన్టీఆర్‌!

By iQlikMovies - July 08, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

చిరంజీవితో త్రివిక్ర‌మ్ సినిమా.. అంటూ అప్పుడెప్పుడో ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. డివివి దాన‌య్య ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతో ఈ క్రేజీ కాంబినేష‌న్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూపులు చూడ‌డం మొద‌లెట్టారు మెగా అభిమానులు. చిరంజీవి ప్ర‌స్తుతం `సైరా`తో బిజీగా ఉన్నారు. ఆ వెంట‌నే కొర‌టాల శివ‌తో సినిమా ఉంటుంది. అది పూర్త‌య్యాకే చిరుతో సినిమా ప‌ట్టాలెక్కుతుంది. అంద‌రి ప్లానింగూ ఇదే. అయితే.. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఎన్టీఆర్ రంగ ప్ర‌వేశం చేసి - ఈ కాంబోకి స్పీడ్ బ్రేక‌ర్‌గా మారాడు.

 

చిరంజీవితో సినిమా చేయ‌డం కంటే ముందు త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తార‌ని, అప్ప‌టి వ‌ర‌కూ చిరు వెయిటింగ్ లిస్టులో ఉండాల్సిందే న‌ని తె తెలుస్తోంది. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబోలో `అర‌వింద స‌మేత‌` వ‌చ్చింది. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ స‌మ‌యంలోనే `మ‌నమిద్ద‌రం మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేద్దాం` అని మాట‌లు ఇచ్చిపుచ్చేసుకున్నారు ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. ఈ యేడాది చివ‌రికి ఆ సినిమాషూటింగ్ పూర్త‌యిపోతుంది.

 

అప్ప‌టికి చిరు - కొర‌టాల శివ సినిమా షూటింగ్ ఇంకా జ‌రుగుతూనే ఉంటుంది. కాబ‌ట్టి ఈలోగా ఎన్టీఆర్ సినిమాని ఫినిష్ చేసేద్దాం అన్న‌ది త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌. ఒక‌వేళ ఎన్టీఆర్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ నుంచి విముక్తుడు కాక‌పోతే గ‌నుక‌.. త్రివిక్ర‌మ్ సైతం వెయిటింగ్ లిస్టులో ఉండాల్సివ‌స్తుంది. అప్పుడు చిరుతో త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. త్రివిక్ర‌మ్ సినిమా పూర్త‌య్యేస‌రికి చిరు, ఎన్టీఆర్‌ల‌లో ఎవ‌రు సిద్ధంగా ఉంటార‌న్న విష‌యంపైనే ఇప్పుడు ఈ రెండు కాంబినేష‌న్లు ఆధార‌ప‌డి ఉన్నాయి. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో??


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS