రిలీజ్ డేట్ అనేది ఈరోజుల్లో చాలా కీలకమైన విషయం. సరైన సమయంలో సినిమాని విడుదల చేయకపోతే - ఫలితంలో చాలా తేడా వస్తుంది. అందుకే... మరో సినిమాతో క్లాష్ అవ్వకుండా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఆగస్టు 30న రెండు సినిమాలు ఒకే సారి వచ్చేస్తున్నాయి. నాగార్జున - నాని సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఢీ కొట్టుకోబోతున్నాయి.
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `మన్మథుడు 2`, నాని సినిమా `గ్యాంగ్ లీడర్` ఆగస్టు 30న రాబోతున్నాయి. నాని ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరోవైపు నాగార్జున కూడా అదే డేట్ పై గురి పెట్టాడని సమాచారం. ఆగస్టు 30 నే `మన్మథుడు 2`ని రిలీజ్ చేద్దామనుకుంటున్నారు.
రెండు సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. రెండూ ఒకేసారి వస్తే గనుక... వసూళ్లపై ప్రభాపం చూపించే అవకాశాలున్నాయి. అందుకే.. ఒక సినిమా వెనక్కి తగ్గడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్డేట్ ముందే ఫిక్స్ చేయడం వల్ల... మన్మథుడు వెనక్కి వెళ్లే ఛాన్సుందని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.