మన్మధుడు అంటేనే రొమాంటిక్. మరి 'మన్మధుడు 2' అంటే ఆ డోస్ డబుల్ ఉండాలి కదా. అందుకే డబుల్ డోస్ ఇవ్వడానికే వచ్చేశాడు మన 'మన్మధుడు' నాగార్జున. లేటెస్ట్గా 'మన్మధుడు 2' టీజర్ విడుదలైంది. టీజర్ మొదట్లో నాగ్ని ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ ఇంట్లో అందరూ సతాయిస్తూ ఉంటారు. ఏకంగా ఇంత వయసొచ్చినా నువ్వు వర్జిన్వే కదరా అంటుంది మన్మధుడి తల్లి. కానీ, మనోడేం తక్కువ తినలేదండోయ్. ఇంట్లో అలా బిల్డప్ ఇస్తూ, బయట మాత్రం అమ్మాయిలతో తెగ రొమాన్స్ చేసేస్తుంటాడు. పాపం అది తెలియక ఇంట్లో వాళ్లు మన్మధుడ్ని బుద్ధిమంతుడు అనుకుని తమకు తోచిన సలహాలిచ్చేస్తుంటారు. అయితే, మనోడి ఫిలాసఫీ ఏంటంటే, 'డోన్ట్ ఫాల్ ఇన్ లవ్.. ఓన్లీ మేకింగ్ లవ్' అని. ఆ ఫిలాసఫీతోనే అమ్మాయిలతో పిచ్చ పిచ్చగా రొమాన్స్ చేసేస్తుంటాడన్న మాట. ఇక మన్మధుడుగా నాగార్జున ఇంత వయసులోనూ ఎంత హ్యాండ్సమ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడంటే, మరి అమ్మాయిలు ఆయనపైకి అలా ఎందుకు ఎగబాకరు చెప్పండి.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్లో దేవదర్శిని, లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు కనిపించారు. కానీ హీరోయిన్లు కనిపించినట్లు లేదు. రొమాంటిక్ సీన్స్‌లో కనిపించిన అమ్మాయిలు హీరోయిన్లు కాదు. ఏది ఏమేతేనేం, ఈ టీజర్‌తో టోటల్‌గా రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోయాడు మన లేటు వయసు ప్రేమికుడు నాగ్. మరి ఈ లేటు వయసు యూత్ కంటెంట్ మూవీ ఎంత మేర ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుందో తెలియాలంటే ఆగస్ట్ 9 వరకూ వేచి చూడాల్సిందే.