ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. `అయిననూ పోయి రావలె హస్తినకు` అనేది వర్కింగ్ టైటిల్. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా మంచు మనోజ్‌ని తీసుకున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఎన్టీఆర్ - మనోజ్ మంచి స్నేహితులు. పైగా మనోజ్ విలన్ పాత్రలు చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. సో.. ఈ వార్త నిజమే అనుకున్నారంతా.
అయితే ఇదంతా తూచ్ అని తేలిపోయింది. మనోజ్‌కి ఇలాంటి ఆఫరేం రాలేదట. త్రివిక్రమ్ అండ్ కో కూడా మనోజ్ పేరుని పరిశీలించలేదట. ''మా వరకూ ఇలాంటి ఆఫర్ రాలేదు. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు'' అంటూ మనోజ్ సన్నిహితులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ కాంపౌండ్ కూడా ఈ విషయమై స్పందించలేదు. మరి ఈ వార్త ఎలా పుట్టిందో? ఎవరు పుట్టించారో??