కౌశల్ కి ఫిదా అయిన దర్శకుడు

By iQlikMovies - August 28, 2018 - 18:38 PM IST

మరిన్ని వార్తలు

నటుడు, మోడల్ అయిన కౌశల్ గురించి చెప్పాలంటే బిగ్ బాస్ కి ముందు ఆ తరువాత అని చెప్పొచ్చు. ఆయనకి కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో దాదాపుగా ఆయనని ఒక రోల్ మోడల్ అంటూ ప్రచారం చేస్తున్నవారు ఉన్నారు.

ఈ తరుణంలో కౌశల్ కి సామాన్యుల నుండే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి కూడా కౌశల్ అభిమానిగా మారిపోయాడు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా చేశాడు.

ఆ ట్వీట్ లో- ఈ మధ్యనే బిగ్ బాస్ ఎపిసోడ్లు చూశాను.. అందులో కౌశల్ ఆటతీరు చాలా నచ్చింది, అదే సమయంలో బయట కౌశల్ ఆర్మీ పేరిట ఆయనకి ఫాలోయింగ్ కూడా రావడం తెలిసింది. ఆయన ఈ సీజన్ విజేత కావాలని కోరుకుంటున్నాను.

ఈ ఒక్క ట్వీట్ తో కౌశల్ ఫ్యాన్స్ కి కౌశల్ ఆర్మీ కి దర్శకుడు మారుతి కి ఇష్టుడైపోయాడు. ఒకరకంగా ఇలా ఇండస్ట్రీ నుండి తొలిసారిగా కౌశల్ ఆర్మీ పై స్పందించిన మొదటివ్యక్తి మారుతీనే..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS