మెహబూబాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పూరి తనయుడు ఆకాష్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఆకాష్‌ని హీరోగా నిలబెట్టాలన్న పూరి ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఆకాష్‌తో మరో సినిమా మొదలెట్టాడు. ఈ చిత్రానికి `రొమాంటిక్` అనే పేరు పెట్టారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రానికి పూరి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పూరీనే నిర్మాత కూడా. దర్శకత్వ బాధ్యతలు మాత్రం పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తారు. `మెహబూబా` తరవాత పూరి దర్శకత్వంలోనే ఆకాష్ సినిమా మొదలవ్వాల్సివుంది.
కానీ... `ఇస్మార్ట్ శంకర్` వల్ల.. పూరి దర్శకత్వ బాధ్యత తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ చిత్రాన్ని మరో యువ దర్శకుడి చేతుల్లో పెట్టాడన్నమాట. టైటిల్‌ని బట్టి ఇదో రొమాంటిక్ చిత్రమని అర్థమైపోతోంది. తొలి సినిమాతో సీరియస్ లవ్ స్టోరీని చెప్పిన పూరి.. ఈసారి మాత్రం వినోదాత్మక బాట పట్టాడు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.