'ఇస్మార్ట్ శంకర్' లో మరో హీరోయిన్ గా నభా నటేష్..!!

మరిన్ని వార్తలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేశారు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ఈ షెడ్యూల్ లో తెరకెక్కిస్తున్నారు.

 

రామ్ సరికొత్తగా, స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ చిత్రం లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

- ప్రెస్ నోట్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS