'బాహుబలి'ని తలపిస్తున్న 'మాస్టర్‌'.!

మరిన్ని వార్తలు

ఇళయ దళపతి విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'మాస్టర్‌'. ఆల్రెడీ రెండు లుక్స్‌ ఈ సినిమా నుండి రిలీజ్‌ చేశారు. ఆసక్తిని పెంచేశారు. ఇక ముచ్చటగా మూడో లుక్‌ రిలీజైంది. ఈ లుక్‌లో విజయ్‌తో పాటు, విలన్‌గా నటిస్తున్న విజయ్‌ సేతుపతి కూడా కనిపిస్తున్నాడు. ఇటు విజయ్‌ అటు విజయ్‌ ఇద్దరూ పవర్‌ఫుల్‌ లుక్స్‌లో కనిపిస్తున్నారు. చొక్కాల్లేకుండా, ఒంటి మీద గాయాలతో భీకరంగా కనిపిస్తున్నారు. నువ్వా.? నేనా.? అన్నట్లుంది వీరి లుక్‌. అచ్చంగా చెప్పాలంటే, కత్తుల్లేవ్‌ కానీ, 'బాహుబలి'లోని భళ్లాల - బాహుబలి పోరాట ఘట్టాన్ని తలపిస్తోంది. అందుకేనేమో రిలీజ్‌ అయిన కొద్దిసేపట్లోనే ఈ లుక్‌కి సోషల్‌ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ వస్తున్నాయి.

 

మరోవైపు ఇటీవలే విజయ్‌ నటించిన 'బిగిల్‌' (తెలుగులో 'విజిల్‌') మంచి విజయాన్ని అందుకుంది. విజయ్‌ సేతుపతి విషయానికి వస్తే, హీరోగా, ప్రతి నాయకుడుగా, విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ దూసుకెళుతున్నాడు. తమిళంతో పాటు, తెలుగులోనూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. సో ఇద్దరికీ తెలుగులో మంచి మార్కెట్‌ ఉండడంతో, ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలున్నాయి. 'మాస్టర్‌'ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి అనిరుధ్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా, మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆండ్రియా కీలక పాత్ర పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS