టాక్ ఆఫ్ ది వీక్‌: 'డిస్కోరాజా'

మరిన్ని వార్తలు

సంక్రాంతి సీజ‌న్ గ‌డిచాక కొన్ని వారాల పాటు బాక్సాఫీసు స్త‌బ్దుగా ఉంటుంది. జ‌నాల ద‌గ్గ‌ర సినిమా టికెట్ల బ‌డ్జెట్ అయిపోతుంది. సంక్రాంతికి వ‌చ్చే హైప్‌ని.. ఆ త‌ర‌వాతి వ‌చ్చే సినిమాలు కొన‌సాగించ‌డం క‌ష్టం. అందుకే సంక్రాంతి ముగిసిన వెంట‌నే సినిమాల్ని విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆలోచిస్తుంటారు. కానీ... ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి `డిస్కోరాజా` ధైర్యం చేసేశాడు. ర‌వితేజ న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 24న విడుద‌లైంది.

 

సైన్స్ ఫిక్ష‌న్‌కి, ర‌వితేజ మార్కు హీరోయిజం, కామెడీ జోడించి తీసిన సినిమా ఇది. చ‌నిపోయిన వ్య‌క్తిని బ‌తికించ‌డం, త‌న‌కు గ‌తం గుర్తుకు రావ‌డం, త‌న శ‌త్రువ‌ల‌పై ప‌గ తీర్చుకోవ‌డం ఇదీ క‌థ‌. మ‌ధ్య‌లో కొన్ని ట్విస్టులు కూడాఉన్నాయి. విశ్రాంతి స‌న్నివేశం, క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్‌. అయితే.. క‌థ‌నం అంత ఆస‌క్తిని రేకెత్తించ‌లేదు. ర‌వితేజ మార్క్ కామెడీ మిస్ అయ్యింది. పాట‌లూ అంతంత మాత్ర‌మే. హీరోయిన్ల కు స‌రైన ప్రాధాన్యం లేదు. అలా... ఈ సినిమా మొద‌టి రోజే ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. డ‌బ్బులు బాగా ఖ‌ర్చు చేసినా, వాటిని తిరిగి రాబ‌ట్టుకోవ‌డం నిర్మాత‌కు క‌ష్ట‌మే. తొలిరోజు దాదాపుగా 2.75 కోట్ల షేర్ వ‌చ్చింది. తొలి మూడు రోజుల‌కూ క‌లిపి రూ.6 కోట్లు కూడా వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దాదాపుగా 25 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టిన సినిమా ఇది. శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ రూపంలో నిర్మాత‌కు బాగానే గిట్టుబాటు అయిన‌ట్టు తెలుస్తోంది. అవే ఈ సినిమాని బ‌తికించాయి.

 

సంక్రాంతికి విడుద‌లైన స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పురములో ఇంకా ఆడుతూనే ఉన్నాయి. స‌రిలేరుని థియేట‌ర్ల‌లో బ‌త‌వంతంగా ఆడిస్తున్న‌ట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఆయా థియేట‌ర్ల‌లో 20 శాతం ఆక్యుపెన్సీ కూడా క‌నిపించ‌డం లేదు. అల వైకుంఠ‌పుర‌ములో కాస్త బెట‌ర్. ఈ వీకెండ్ బ‌న్నీ సినిమాకే ఎక్కువ టికెట్లు తెగాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS