ఈమధ్య అన్ని భాషల్లో రీమేక్ సినిమాల జోరు పెరిగింది. మలయాళం, తమిళ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ లిస్టులో తాజాగా మరో తెలుగు సినిమా చేరింది. పోయినేడాది క్రిస్మస్ సీజన్లో విడుదలైన 'మత్తు వదలరా' బాక్స్ ఆఫీస్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా సాధించింది. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారని సమాచారం.
రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ 'మత్తు వదలరా' ఈ సినిమాతో ఎంఎం కీరవాణి తనయుడు సింహా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు కీరవాణి గారి మరో అబ్బాయి కాల భైరవ సంగీతం అందించాడు. మొదట ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల హిందీ వెర్షన్ ఆలోచన పక్కన పెట్టారట. ఈ సినిమా యూనివర్సల్ అప్పీల్ ఉండడంతో ఇప్పుడు హిందీ వెర్షన్ ప్లాన్ చేస్తున్నారట.
ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన రితేష్ రానా హిందీ రీమేక్ ను కూడా తెరకెక్కిస్తున్నాడట. ప్రస్తుతం హిందీ వెర్షన్ స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోందని, త్వరలోనే ఈ సినిమాకు పని చేసే నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు వెల్లడవుతాయి. డిసెంబర్ లోపే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం.