చిరంజీవితో ఛాన్స్‌: ఆ కిక్కే వేరంటోన్న త్రిష.!

మరిన్ని వార్తలు

'సైరా నరసింహారెడ్డి'తో తన డ్రీమ్‌ నెరవేర్చుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ఓ కమర్షియల్‌ సినిమాలో నటించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ సినిమా కోసం చిరంజీవి ఊహించని విధంగా మేకోవర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక అసలు సిసలు కమర్షియల్‌ హీరోలా ఛేంజ్‌ అయిపోయిన మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించబోయే అందాల భామ ఎవరు? అనే అంశంపై ఇంకా క్లారిటీ రావల్సి వుంది.

 

ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించబోతుందనే వార్త ప్రచారంలో ఉంది. అయితే, ఈ విషయాన్ని తాజాగా త్రిష ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తన వద్దకు రాలేదని చెప్పింది. అయితే, చిరంజీవితో నటించడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని, ఆయన లెజెండ్‌ అనీ ప్రశంసలు గుప్పించింది. ఒకవేళ ఛాన్సొస్తే అస్సలు వదులుకోననీ చెప్పింది. అంతేకాదు, హీరోయిన్‌గా కాకున్నా, చిన్న రోల్‌ దొరికినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

 

గతంలో 'స్టాలిన్‌' చిత్రంలో చిరంజీవితో కలిసి నటించింది త్రిష. ఇక కొరటాల - చిరు సినిమాని ప్యాన్‌ ఇండియన్‌ మూవీగా తెరకెక్కించాలనుకుంటున్నారు. సో హీరోయిన్‌ విషయమై భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. ప్యాన్‌ ఇండియన్‌ మూవీ కాబట్టి హీరోయిన్‌ ఇమేజ్‌ కూడా ఆ స్థాయిలో ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో ఏమో చిరంజీవి కోసం నార్త్‌ నుండి ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా తదితర ముద్దుగుమ్మలెవరైనా టాలీవుడ్‌కి దిగొస్తారేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS