'మేడమీద అబ్బాయి' బాగున్నావోయ్‌!

మరిన్ని వార్తలు

అల్లరి నరేష్‌ కొత్త సినిమా 'మేడమీద అబ్బాయి' టీజరొచ్చిందోయ్‌! మామూలుగా అల్లరి నరేష్‌ సినిమాలంటే మాంఛి సౌండింగ్‌తో బీభత్సమైన స్పీడ్‌తో కూడిన కామెడీ డైలాగులుంటాయి. ఎక్కువ స్పూఫ్‌లని వాడేస్తుంటారు అల్లరి నరేష్‌ సినిమా కోసం. కానీ 'మేడమీద అబ్బాయ్‌' సినిమా ఏదో కొంచెం కొత్తగా అనిపిస్తోంది. సిట్యుయేషన్‌ నుంచి కామెడీ లాగినట్టున్నారు. కథా రచయితగా సినిమాలకోసం కథలు తయారుచేసుకునే ఓ కుర్రాడు, ప్రభాస్‌ - రామ్‌చరణ్‌ లాంటి పెద్ద హీరోల సినిమాలకి దర్శకత్వం వహించేసి లైఫ్‌లో సెటిలైపోవాలనే ఆలోచనలతో కలిగి ఉంటాడు. అతడే 'మేడమీద అబ్బాయి'. మనోడికి ఓ లవరుంటుంది. ఇదీ టీజర్‌ చెప్పిన కథ. ఎక్కడా ఓవర్‌ స్పీడ్‌ లేదు. అంతా కూల్‌గా, కామ్‌గా కనిపించింది. అల్లరి నరేష్‌ సినిమాల్లోనే ఇదొక డిఫరెంట్‌ మూవీ అని టీజర్‌తో చెప్పకనే చెప్పేశారు. 'జబర్‌దస్త్‌' ఆది అల్లరి నరేష్‌ పక్కనే కనిపించాడుగానీ, పంచ్‌లు వేయలేదు. అంటే టీజర్‌ కోసం చాలా కేర్‌ తీసుకున్నారన్నమాట. లొకేషన్స్‌ అదిరిపోయాయి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌గా ఉంది. విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. టీజర్‌తోనే అల్లరి నరేష్‌ సగం సక్సెస్‌ సాధించేశాడనుకోవచ్చేమో అనిపిస్తుంది. టీజర్‌ వరకూ 'మేడమీద అబ్బాయి' బాగున్నాడు, ట్రైలర్‌లో ఇంకెలా ఉంటాడో, సినిమాలో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS