'మీకు మాత్రమే చెప్తా' అంటూ అన్నీ అబద్ధాలే చెప్పారుగా!

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ నిర్మాతగా డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ని హీరోగా చేసిన రూపొందించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌లోనే విలక్షణత చూపించారు. ఫన్నీగా టైటిల్‌ అనౌన్స్‌ చేశారు. ఇక లేటెస్ట్‌గా టీజర్‌ వదిలారు. టీజర్‌ కూడా చాలా చాలా ఫన్నీగా డిజైన్‌ చేశారు. సినిమాలో స్టోరీ ఏంటనేది క్లారిటీగా రివీల్‌ చేయలేదు కానీ, టీజర్‌ వరకూ బాగా డిజైన్‌ చేశారు. హీరోయిన్‌, హీరో మధ్య డిస్కషన్‌తో టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది.

 

నువ్వు డ్రింక్‌ చేస్తావా.? స్మోక్‌ చేస్తావా.? అమ్మాయిలు.. గంజాయి.. వంటి బ్యాడ్‌ హేబిట్స్‌ ఉన్నాయా.? అంటే అబ్బెబ్బే నేను చాలా మంచోన్ని, ఆ బ్యాడ్‌ హేబిట్స్‌ ఏమీ తనకు లేవు.. అంటూ హీరో, హీరోయిన్‌కి చెబుతాడు. సీన్‌ కట్‌ చేస్తే, ఆ తరువాత వాటిన్నింట్లోనూ అయ్యగారి విశ్వరూపం చూపిస్తాడు. స్మోకింగ్‌లో అయితే, రింగులు రింగులుగా పొగను వదులుతూ మన హీరోగారు ఆస్వాదించే ఆస్వాదన అహో ఒహో అనిపిస్తుంది. నవ్వు తెప్పిస్తుంది. అయితే, ఈ స్టోరీలో ఫోన్‌ కీలకం అని తెలుస్తుంది. మన హీరోగారి చిలిపి చేష్టలన్నీ ఫోన్‌లో రికార్డ్‌ అవుతుంటుంది. అదెలా.? అనేది తెలీదు. మాటల్లో అయితే, మంచోడినంటూ కవరింగ్‌లేస్తాడు. ఫోన్‌ చూస్తే అసలు బాగోతం బయటపడుతుంటుంది.

 

మరి తన అబద్ధాల జర్నీతో మన హీరో ఎలా ంటి చిక్కుల్లో పడ్డాడు.? హీరోయిన్‌ మనసు ఎలా దోచుకున్నాడు.? అనేదే కథ. టీజర్‌ చివర్లో 'మధ్యపానం, ధూమపానం, అసత్యాలు ఆరోగ్యానికి హానికరం' అనే కొటేషన్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. తరుణ్‌ భాస్కర్‌ యాక్టింగ్‌ నేచురల్‌గా ఉంది. మొత్తానికి విజయ్‌ దేవరకొండ తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌ని పట్టుకుని, భలే ఎంటర్‌టైనర్‌ని ప్లాన్‌ చేశాడని 'మీకు మాత్రమే చెప్తా' సినిమా టీజర్‌ చూస్తుంటే అర్ధమవుతోంది. 'పెళ్లిచూపులు'లా ఇది కూడా సెన్సేషన్‌ అవుతుందా.? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS