మీనా భర్త విద్యాసాగర్ ఇటివలే మరణించారు. ఆమె ఇంకా ఆ బాధ నుండి కొల్కోలేదు. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి.
అయితే తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలను మీనా ఖండించింది. తన భర్త మరణం తాలూకు బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని, అప్పుడే తన రెండో పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని ఆమె కోరింది. మీనా క్లారిటీతో రెండో పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడింది.