అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్'. సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. హడావిడిగా టీజర్ కూడా వదిలారు. తర్వాత అంతా గప్ చుప్. ఈ సినిమా మొదటి నుండి లేజీగా నడుస్తోంది. అఖిల్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. దర్శకుడు చెప్పింది చేశాడు. అయితే అవుట్ పుట్ పై మాత్రం అఖిల్ లో తృప్తి లేదు. నాగార్జున అవుట్ పుట్ చూశారు. ఆయన చాలా రీషూట్లు సూచించారు.
స్క్రిప్ట్ లో కూడా చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. అందుకే టీజర్ తర్వాత మరో అప్డేట్ ఇవ్వలేదు. ఇపుడున్న పరిస్థితిలో సంక్రాంతి విడుదల లేదని తేలిపోయింది. అయితే కొత్త డేట్ పై కూడా టీం నుండి ఎలాంటి క్లారిటీ లేదు. 'ఏజెంట్' నిర్మాణ పరమైన సమస్యలు కూడా వున్నాయి. అఖిల్ మార్కెట్ కి ఎప్పుడో దాటిపోయింది ఏజెంట్ బడ్జెట్. ఇప్పుడీ ప్రాజెక్ట్ సేఫ్ గా బయటపడాలంటే ఏదో మ్యాజిక్ జరగాల్సిందే.