హీరోగానే కాదు... నిర్మాతగానూ నాని తన అభిరుచి చాటుకొంటున్నాడు. `ఆ`, `హిట్` సినిమాలతో నిర్మాతగా తనది విభిన్నమైన ప్రయాణమని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు `మీట్ - క్యూట్` అనే ఆంథాలజీ రూపొందించాడు నాని. సత్యారాజ్, రోహిణి, ఆదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి.. ఇలా పేరెన్నదగిన తారాగణమే నటించింది. దీప్తి గంటా దర్శకత్వం వహించింది. సోనీ లీవ్ `మీట్ - క్యూట్` హక్కుల్ని సొంతం చేసుకొంది. త్వరలోనే విడుదల కాబోతోంది. ఇప్పుడు టీజర్ బయటకు వదిలారు.
నాలుగు కథల సమాహారం ఈ మీట్ క్యూట్. ప్రేమ, కోపం, బాధ, సంతోషం, కన్నీళ్లు,భావోద్వేగాలు, రొమాన్స్ ఇలా అన్ని కోణాల్నీ ఈ కథల్లో సృశించినట్టు అనిపిస్తోంది. అన్ని కథల్లోనూ మానవ సంబంధాలకే పెద్ద పీట వేసినట్టు అనిపిస్తోంది. టీజర్.. ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీలా సాగింది. డైలాగ్స్ కూడా సున్నితంగా ఉన్నాయి. `రిలేషన్ షిప్స్ ఫెయిల్ అయ్యేది చిన్న చిన్న గొడవల వల్ల కాదు... ఇట్ ఫైట్స్ వెన్ యూ స్టాప్ ఫైటింగ్` అనే డైలాగ్ తో టీజర్ కి ఎండ్ కార్డ్ పడింది. ఇంత స్టార్ కాస్ట్ ఉన్న ఆంథాలజీ ఈమధ్య తెలుగులో రాలేదు. పైగా నాని నిర్మాత. సో.. ఈ మీట్ క్యూట్ పై ఓ లుక్ వేయొచ్చన్న భరోసా కలిగింది.