బాలీవుడ్‌ ఆలోచనలో మెగా హీరో.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ సినిమాల్లో నటించాలని ఎవ్వరికి ఉండదు చెప్పండి. అయితే, బాలీవుడ్‌ సినిమాల్లో నటించాలంటే, ఆ స్థాయి, స్థానం మరోలా ఉంటుంది. మెగా కాంపౌండ్‌ విషయానికి వస్తే, ఆ అర్హతలన్నీ పుష్కలంగా ఉన్న హీరో వరుణ్‌ తేజ్‌ అని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఆయన ఒడ్డూ పొడవూ.. అప్పియరెన్స్‌ అన్నీ అచ్చు బాలీవుడ్‌ హీరోల్ని తలపించేలానే ఉంటాయి. అన్నట్లు ఈ మెగా రాకుమారుడికి బాలీవుడ్‌ నుండి ఆఫర్లు కూడా వస్తున్నాయట. అయితే, తెలుగులో వరుస సినిమాలను ఒప్పుకోవడం వల్ల షెడ్యూల్స్‌ మేనేజ్‌ చేయలేక ఆ ఆలోచన చేయడం లేదట. కానీ, మంచి కథ దొరికితే బాలీవుడ్‌లో సినిమా చేయడం తనకెంతో ఇష్టమంటున్నాడు.

 

బాలీవుడ్‌లో తన ఫేవరేట్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ అని చెబుతున్నాడు. ఆయనతో కలిసి నటించాలనే తన మనసులోని మాటను బయటపెట్టేశాడు, మరి, మెగా ప్రిన్స్‌ కోరిక నెరవేరుతుందా.? వేచి చూడాలి. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ 'బాక్సర్‌' సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ప్రొఫిషనల్‌ బాక్సర్‌గా కనిపించనున్న వరుణ్‌ తేజ్‌ ఆ మేకోవర్‌ కోసం విదేశాలకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. రేపో మాపో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది ఈ సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS