మెగా పవర్‌స్టార్‌ మరో విజయం సాధించేశాడంతే.!

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమాతో ఈ ఏడాది టాలీవుడ్‌కి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన చరణ్‌ ఇంకో విజయం కూడా సాధించాడు. మెగా కాంపౌండ్‌లో జరిగే ఈవెంట్స్‌కి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హాజరు కాకపోవడం పట్ల మెగా అభిమానులు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగైనా సరే బాబాయ్‌ని మెగా ఈవెంట్స్‌కి రప్పించాలని మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఎప్పటినుండో భగీరధుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 'ధృవ' ఆడియో ఫంక్షన్‌కి వస్తాడని భావించారు. కానీ రాలేదు.

చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150'కి కూడా పవన్‌ కళ్యాణ్‌ వస్తాడని అనుకున్నారు. రాలేదు. ఆ సినిమాకి చరణ్‌ నిర్మాత కూడా. అంతేకాదు ఆ టైంలో మెగా కాంపౌండే విసిగిపోయింది పవన్‌ ప్రవర్తన విషయంలో. 'ఆడు రానంటున్నాడు మేమేం చేస్తాం. దమ్ముంటే మీరైనా రప్పించుకోండి..' అని అభిమానులకు ఆవేశంగా నాగబాబు సూచించాడు కూడా. అయితే ఎట్టకేలకు ఈ విషయంలో చరణ్‌ సాధించాడు. మెగా పవర్‌స్టార్‌ అనిపించుకున్నాడు. 'రంగస్థలం' సక్సెస్‌ ఈవెంట్‌ ఈ రోజు ఘనంగా జరగనుంది.

ఈ వేడుకకు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా వస్తున్నాడు. ఇటీవల చరణ్‌తో కలిసి పవన్‌ కళ్యాణ్‌ 'రంగస్థలం' సినిమా చూశాడు. చాలా బాగుందని ప్రశంసించాడు. ఈ రోజు సక్సెస్‌ మీట్‌కి విచ్చేస్తున్నాడు. అన్నింటికీ మించి, కేవలం ఈ వేడుక పవన్‌ కళ్యాణ్‌ కోసమే, చరణ్‌ ప్లాన్‌ చేశాడనీ తెలుస్తోంది. ఏది ఏమైతేనేం మొత్తానికి మెగా కాంపౌండ్‌లో ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని నిరూపించుకునేందుకు ఈ ఈవెంట్‌ ఓ నిదర్శనం కానుంది. చూసే ప్రేక్షకులకు కన్నుల పండగా కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS