తెలుగమ్మాయి తెలుగమ్మాయే. తెలుగమ్మాయి కాబట్టి, తెలుగమ్మాయికి సమస్య వచ్చిందని సపోర్టింగ్‌గా స్పందించింది అర్చన అని అర్చనను పొగిడేసింది శ్రీరెడ్డి. అయితే ఓ మహిళగా సాటి మహిళకు కష్టంలో ఉందని స్పందించాను అంతే తప్ప తెలుగమ్మాయా కాదా అనే కోణంలో స్పందించలేదు అని వెంటనే కౌంటర్ ఇచ్చింది నటి అర్చన. ఒక మహిళ వచ్చి నడిబజార్లో తన ఆందోళన వెళ్లగక్కుతున్నప్పుడు అక్కడ దగ్గరల్లో ఉన్న సినీ పెద్దలెవరైనా వచ్చి ఆపి ఉండాల్సింది. నిరసనకు మార్గం ఇది కాదు అని ఆమెని వారించి ఉండాల్సింది.
అది జరగలేదు అని ఫిల్మ్ నగర్‌లో శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శనపై అర్చన స్పందించింది. అలాగే ఆమె ఒకవేళ తప్పు చేసిందని భావిస్తే, అందుకు వేరే విధంగా స్పందించాల్సి ఉంటుందనీ, అంతే తప్ప ఆమెని ఇండస్ట్రీ నుండి బహిష్కరించడం అనేది తప్పు అని శ్రీరెడ్డిని సినిమాల నుండి బ్యాన్ చేయడాన్ని అర్చన తప్పు పట్టింది. 'నాకయితే అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్‌ని. అవకాశాలు వస్తేనే సినిమాలు చేస్తాను. తప్ప అవకాశాల కోసం ఏ రకమైన చీప్ ట్రిక్స్ ప్లే చేయను.
కానీ ఫిలిం ఇండస్ట్రీలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు అనేది ఉందని మాత్రం విన్నాను' అని అర్చన చెప్పింది. అర్చన అందమైన అమ్మాయే కాదు, చాలా తెలివైన అమ్మాయి కూడా. అందుకే ఇండస్ట్రీపై అసభ్య ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డిని సపోర్ట్ చేసినట్లుగానే మాట్లాడింది కానీ, తనను తాను సేఫ్ జోన్‌లో పెట్టుకుంది.