'అంతరిక్షం'తో ఆకట్టుకున్న వరుణ్‌తేజ్ తదుపరి సినిమాని కూడా ఎప్పుడో లైన్‌లో పెట్టేశాడు. ఆ సినిమాలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటించనున్నాడనీ సమాచారమ్. అందుకోసం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడట. కండలు తీరిన దేహం కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాకి అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. యమ్. యమ్. కీరవాణి తనయుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్నాడు.
'మిస్టర్', తొలిప్రేమ' సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేసిన కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్‌తో ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమా రూపొందబోతోంది. విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలో వరుణ్‌తేజ్ ఆశక్తిని పసిగట్టిన కిరణ్ కొర్రపాటి వరుణ్ కోసం ఓ స్టోరీ లైన్ ప్రిపేర్ చేశాడట. ఆ స్టోరీ లైన్ వరుణ్‌కి వినిపించగా చాలా బాగుంది.. డెవలప్ చేయమని సూచించాడట. అలా బాక్సింగ్ నేపథ్యంలో అదిరిపోయే స్క్రిప్టును వరుణ్‌తేజ్ కోసం సిద్ధం అయిందనీ తెలుస్తోంది.
అంతరిక్షంలో సాహసాలు చేసిన వరుణ్‌తేజ్ తదుపరి 'ఎఫ్ 2' చిత్రంతో మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుణ్ ఎంచుకున్న సబ్జెక్ట్స్‌లో ఇది కూడా విలక్షణమైన క్యారెక్టరే. వెంకీతో పోటీ పడి కామెడీ చేయడం అనేది వరుణ్‌కి కత్తిమీద సామే. ఈ సాహసంలో వరుణ్ ఎన్ని మార్కులేయించుకుంటాడో చూడాలి మరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్ 2'లో మెహ్రీన్ వరుణ్‌తో జోడీ కడుతుండగా, వెంకీ సరసన తమన్నా నటిస్తోంది.