కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిందే. అలా జరగాలంటే... మాస్క్ ధరించాల్సిందే. ఈ విషయంలో సెలబ్రెటీలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమవంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. చిరంజీవి ముందు నుంచీ - ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. ఇప్పుడు మరో సోషల్ మెసేజ్ ఇచ్చారు. `మీసం మెలేయడం మగాడి లక్షణం.. అది ఒకప్పుడు, ఇప్పుడు మాస్క్ ధరించిన వాడే వీరుడు` అంటూ... ఓ వీడియోని రూపొందించారు.
ఈ వీడియోలో చిరుతో పాటు, యువ సంచలనం కార్తికేయ కూడా కనిపించారు. ఇద్దరూ కలిసి ఓ వీడియో చేయడం, దాంతో ఓ సోషల్ మేసేజీ ఇవ్వడం.. ఆ కథానాయకుల అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. హీరోలేం చెప్పినా జనం వింటారు. ఫాలో అవుతారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల్లో కొంతమందైనా ఈ సూచన పాటిస్తే... చిరు, కార్తికేయల లక్ష్యం నెరవేరినట్టే.