అభిమానులే మా దేవుళ్లు అని చెబుతుంటారు మన హీరోలు. అవకాశం వచ్చినప్పుడు దేవుళ్లగానూ అవతారం ఎత్తుతుంటారు. తమ అభిమానుల కోసం, వాళ్ల ఆరోగ్యాల కోసం ఏమైనా చేయడానికి సిద్ధ పడతారు. ఇప్పుడు చిరంజీవి అదే చేశారు. తన అభిమాని కోసం వైద్య సహాయం అందించడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలు నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధ పడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి హుటా హుటిన స్పందించారు. నాగలక్ష్మి రిపోర్ట్స్ తెప్పించుకున్న చిరంజీవి, హైదరాబాద్ లోని వైద్యులతో మాట్లాడారు. సత్వరం ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో, నాగలక్ష్మిని గుంటూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నాగలక్ష్మికి చిరు తన సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయిస్తున్నారు. అభిమానుల పట్ల చిరంజీవి చూపిస్తున్న ఈ సేవాతత్పరత... మెగాఫ్యాన్స్కి సంతోషాన్ని, మరింత ఉత్సాహాన్నీ కలిగిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.