మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా ఓ షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. ఏంటంటారా.? ఇకపై అయన, వరుస పెట్టి సినిమాలు చేయబోతున్నారట. ఇప్పటికే రీ ఎంట్రీలో చిరంజీవి నుండి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. మూడో సినిమా ‘ఆచార్య’గా లైన్‌లో ఉంది. అయితే, ఇవే కాదట. ఇకపై చాలా చాలా సినిమాలు చేయబోతున్నారట చిరంజీవి . ‘ఆచార్య’ తర్వాత ‘సాహో’ డైరెక్టర్ సుజిత్‌తో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారట. అదే కాదు, మెహర్ రమేష్‌తో ఓ సినిమా ఉందట.
ఆ తర్వాత డైరెక్టర్ బాబీతోనూ చిరంజీవికి కమిట్‌మెంట్ ఉందట. అంతేనా.. హరీష్ శంకర్‌తో ఓ సినిమా కూడా ఉందట. వీటితో పాటు మరిన్ని కథలు, మరింత మంది డైరెక్టర్లు చిరంజీవి లిస్ట్‌లో ఉన్నారట. అయితే, ఇన్ని సినిమాలు చేయడం సాధ్యమేనా.? ‘ఖైదీ’ సినిమా తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేయడానికి చిరంజీవికి చాలా టైం పట్టింది. ఇక ఇప్పుడు తాజా మూవీ ‘ఆచార్య’ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలనుకున్నా, కరోనా కారణంగా ఆలస్యమవుతోంది. మరి, ఇన్ని ప్రాజెక్టులు చిరంజీవి ఎప్పటికి పూర్తి చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, ఇదేదో ఉత్తుత్తి ప్రచారం కానే కాదు. చిరంజీవి స్వయంగా చెప్పిన మాటే.
లేటెస్ట్‌గా ఓ ఛానెల్‌కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాలను స్పష్టం చేశారు. సో చిరంజీవి మాటిచ్చారంటే అంత ఆషామాషీ కాదు. ఖచ్చితంగా చేసే చూపిస్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దిస్ మెగా మూవీ ఫెస్టివల్.