టైటిల్‌ కన్‌ఫామ్‌ చేసిన మెగాస్టార్‌.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ 152కి టైటిల్‌ కన్‌ఫామ్‌ అయిపోయింది. స్వయానా అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి తన సినిమాకి టైటిల్‌ని రివీల్‌ చేసేశారు. ఇదేమీ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కాదు, ఫ్యాన్స్‌ సమక్షంలో బహిరంగంగా అన్నయ్య ప్రకటించిన ప్రకటన. ప్రకటన కాదు, మెగాస్టార్‌ మాట అనాలేమో. అసలు వివరాల్లోకి వెళితే, బ్రహ్మాజీ తనయుడు హీరోగా డెబ్యూ చేస్తున్న ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో ‘ఓ పిట్టకథ’ గురించి మాట్లాడుతూ, తన సినిమా టైటిల్‌ గురించి కూడా రెస్పాండ్‌ అవ్వాల్సి వచ్చింది. ‘ఆచార్య’ అంటూ తన సినిమాకి టైటిల్‌ని చెప్పేశారు.

 

అంతేకాదు, సోషల్‌ మీడియా, టెక్నాలజీ ఈ రేంజ్‌లో విస్తరించిన వేళ ఏ విషయాన్నీ ఎక్కువ రోజులు దాచలేమనీ చెబుతూ, జరుగుతున్న ప్రచారం నిజమే.. ఇంకెందుకు దాచడం అంటూ, చిరంజీవి తన సినిమా టైటిల్‌ రివీల్‌ చేసేశారు. అలా ‘ఓ పిట్టకథ’ ఫంక్షన్‌లో మెగాస్టార్‌ 152 టైటిల్‌ రివీల్‌ అయిపోయిందన్న మాట. ఇదిలా ఉంటే, ఈ టైటిల్‌పై గత కొంత కాలంగా విసృతంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడంటూ ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరేలా ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్లు కూడా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. చిరంజీవి మాటల్ని బట్టి, మెగాస్టార్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌.. ఈ ప్రచారం కూడా నిజమేనేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS