పవర్‌ స్టార్‌ ట్రీట్‌: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.!

మరిన్ని వార్తలు

రాజకీయాల్లోకి వెళ్లాకా, సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాల్లోకి వస్తాడని ఊహించలేదు ఫ్యాన్స్‌. సంకల్పమ్ గొప్పదైతే, జరిగి తీరుతుందంటే ఇదేనేమో. పవర్‌ స్టార్‌ మళ్లీ సినిమాల్లోకి రావాలన్న ఫ్యాన్స్‌ కోరిక చాలా బలమైనది. అందుకే అనూహ్యంగా ఆయన తిరిగి సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇక ఆయన రీ ఎంట్రీ ఇస్తున్న మూవీకి టైటిల్‌ కన్‌ఫామ్‌ చేసే సమయమొచ్చింది. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాకి ఫస్ట్‌లుక్‌తో కూడిన టైటిల్‌ కన్‌ఫామ్‌ చేయనున్నారు.

 

‘వకీల్‌ సాబ్‌’, ‘లాయర్‌ సాబ్‌’ అనే రెండు టైటిల్స్‌ ఈ సినిమాకి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఏదో ఒకటి కన్‌ఫామ్‌ చేస్తారా.? లేక మరేదైనా కొత్త టైటిల్‌ దించుతారా.? అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇదిలా ఉంటే, నిజానికి ఇదేమీ కమర్షియల్‌ మూవీ కాదు. అలాంటిది ఈ సినిమాకి ఈ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ కావడం ట్రేడ్‌ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత రెండు రోజులుగా ఇదే విషయమై సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రోజు సాయంత్రం టైటిల్‌ కన్‌ఫామ్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ మొట్ట మొదటిసారిగా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేయడం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. దిల్‌రాజుతో కలిసి, ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఈ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకుడు, అంజలి, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS