మేఘా ఆకాష్‌ జాక్‌పాట్‌ కొట్టేసిందోయ్‌.!

మరిన్ని వార్తలు

మేఘా ఆకాష్‌ జాక్‌ పాట్‌ కొట్టేసిందండోయ్‌. విలక్షణ నటుడు, విజయాల్ని తన పేరుగా పెట్టుకుని దూకుడు చూపిస్తున్న నటుడు విజయ్‌ సేతుపతి సరసన హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. అనుకోకుండా మేఘా ఆకాష్‌ని వరించేసింది ఈ ఆఫర్‌. విజయ్‌సేతుపతి 33వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. వాస్తవానికి ఈ సినిమాలో అమలాపాల్‌ హీరోయిన్‌గా ఎంపికైంది.

 

అయితే, ప్రస్తుతం అమలాపాల్‌ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాకి డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేని పరిస్థితిలో ఆ అవకాశాన్ని వదులుకోవల్సి వచ్చింది. అలా అమలా వదులుకుందో లేదో, అనుకోకుండా, ఆ ప్లేస్‌లోకి మేఘా వచ్చి జాయిన్‌ అయ్యింది. వెంకట్‌ కృష్ణ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. చంద్రా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. మేఘా ఆకాష్‌ ఆల్రెడీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యిందనీ సమాచారమ్‌. ఈ ఛాన్స్‌ దక్కడంతో మేఘా ఆనందానికి అవధుల్లేవట.

 

ఇంతవరకూ తెలుగు, తమిళ భాషల్లో నటించినా, మేఘా ఆకాష్‌కి ఒక్కటీ సరైన హిట్‌ లేదు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలోనూ నటించింది కానీ, అదీ తన కెరీర్‌కి పెద్దగా కలిసి రాలేదు మేఘా ఆకాష్‌కి. కానీ, విజయ్‌ సేతుపతి లెక్కే వేరు. ఆయన ఏ సినిమాలో ఉన్నా, ఆ సినిమా సూపర్‌ హిట్‌ అనే సెంటిమెంట్‌ వర్కింగ్‌లో ఉందిప్పుడు. అలాంటిది ఆయన సినిమాలో హీరోయిన్‌ అంటే, మేఘా ఆకాష్‌ హిట్‌ తన ఖాతాలో వేసేసుకున్నట్లే కదా. చూడాలి మరి, మేఘా కెరీర్‌ ఇక్కడితోనైనా టర్న్‌ అవుతుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS