ర్యాంప్‌ వాక్‌తో షాక్‌ ఇచ్చిన శ్రీరెడ్డి!

మరిన్ని వార్తలు

ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్‌ చేసి, వార్తల్లో నిలవాలనుకుంటుంది శ్రీరెడ్డి. ముఖ్యంగా సోషల్‌ మీడియాని శ్రీరెడ్డి వాడినంత జుగుప్సాకరంగా మరొకరు వాడి ఉండరేమో. ఆమె నోరు తెరిస్తే, జుగుప్సా. వీరు, వారు.. ఆడా, మగా, భాష, ప్రాంతం అనే తేడాలు అస్సలు లేవు శ్రీరెడ్డికి. ఎప్పుడు, ఎలా, ఎవరి మీద ఒళ్లు గగుర్పొడిచేలా రెస్పాండ్‌ అవుతుందో ఆమెకే తెలీదు. అలాంటి శ్రీరెడ్డి నెటిజన్స్‌కి డిఫరెంట్‌గా ఓ భారీ షాకిచ్చింది. ర్యాంప్‌ వాక్‌ చేసి మరోసారి జుగుప్సా కలిగించింది.

 

పాప ఈ మధ్య చెన్నైకి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో పాప చేసిన రచ్చకి దాదాపు తెలుగు సినీ పరిశ్రమ ఆమెని బ్యాన్‌ చేసినంత పని చేసింది దాంతో, తమిళంలో అవకాశాల కోసం ట్రై చేసింది. అక్కడ ఏదో ఒకటీ అరా అవకాశాలు దక్కించుకుందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ, క్లారిటీ లేదు. లేటెస్ట్‌గా శ్రీరెడ్డి ర్యాంప్‌ వాక్‌ ఇప్పుడు సెన్సేషనల్‌ అయ్యింది.

 

చెన్నైలో ఓ కార్యక్రమంలో ఇలా ర్యాంప్‌పై అత్యంత జుగుప్సాకరమైన దుస్తుల్లో శ్రీరెడ్డి దర్శనమిచ్చింది. ఆమె భారీ అందాల అరాచకాలను తట్టుకోవాలంటే, కాస్త గుండె నిబ్బరం ఉండాల్సిందే. వయసు పైబడిన ముసలివాళ్లూ, 12 ఏళ్ల లోపు పిల్లలూ ఈ చిత్రాన్ని తల్లితండ్రుల పర్యవేక్షణలో చూడాలి.. అని కొన్ని సినిమాల ప్రదర్శనకు ముందు ఓ నోట్‌ రిలీజ్‌ చేస్తారు కదా.. అలా ఈ పిక్స్‌ చూడాలంటే అలాంటి ఓ హెచ్చరికలాంటిది జారీ చేయాలేమో. అంత అరాచకం సృష్టిస్తున్నాయి ఈ పిక్స్‌. తస్మాత్‌ జాగ్రత్త.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS