ఈ మధ్య సడన్ గా మెహర్ రమేష్ పేరు మళ్లీ వార్తల్లో వినిపించడం మొదలెట్టింది. మెగా కాంపౌండ్లో తరచూ కనిపిస్తున్నాడు మెహర్ రమేష్. తన కోసం మెహర్ ఓ కథ కూడా సిద్ధం చేస్తున్నాడని.. చిరు ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో.. మెగా సర్కిల్ లో మెహర్ గురించి మాట్లాడుకోవడం మొదలైంది. చిరుతో మెహర్ ఎలాంటి సినిమా తీస్తాడు? ఆ ప్రాజెక్టు ఉంటుందా, లేదా? అనే ఆసక్తికరమైనచర్చ మొదలైంది.
సినిమా సంగతేమో గానీ, మెహర్ ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ రూపొందించడంలో బిజీగా ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. చిరు తనయ సుస్మిత ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మాతగా మారింది. ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగాతో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. తదుపరి ప్రాజెక్టు మెహర్ రమేష్ తో అని తెలుస్తోంది. మెహర్ సినిమాలన్నీ స్టైలీష్ మేకింగ్ తో రూపొందించినవే. ఈసారి కూడా అలాంటి కథనే వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నాడని టాక్. ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తానని మెహర్ ఇది వరకే మాటిచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ఆహా లోనే స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు బయటకు రావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి.