వరుణ్-మెహ్రీన్ ల జోడి..

By iQlikMovies - March 29, 2018 - 13:46 PM IST

మరిన్ని వార్తలు

ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న నటి మెహ్రీన్ కి మరో బంపర్ ఆఫర్ దక్కిన్నట్టు ఫిలిం నగర్ సమాచారం.

ఆ సమాచారం బట్టి, వరుణ్ తేజ్-అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న F2 చిత్రంలో హీరో వరుణ్ తేజ్ సరసన నటించే హీరోయిన్ పాత్ర కోసం మెహ్రీన్ ని ఎంపిక చేసారట. దీనితో మరో మెగా హీరో పక్కన నటించే అవకాశాన్ని ఈ అమ్మడు కొట్టేసింది అని చెప్పొచ్చు.

ఇప్పటికే వెంకటేష్ పక్కన తమన్నాని హీరోయిన్ ఎంపిక చేయటం జరగగా ప్రస్తుతం మెహ్రీన్ ని కూడా సెలెక్ట్ చేయడంతో ఈ సినిమా కాస్టింగ్ పూర్తయినట్టుగానే చెప్పొచ్చు. ఇదిలావుండగా f2 చిత్ర షూటింగ్ ఈ ఏడాది మధ్య నుండి మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ఈ అందాల తారకి f2 చిత్రం విజయవంతం అయితే ఈ అమ్మడు కెరీర్ కి ఇక తిరుగుండదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS