#NTRBiopic రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు

By iQlikMovies - March 29, 2018 - 12:41 PM IST

మరిన్ని వార్తలు

కొద్దిసేపటి క్రితం #NTRBiopic కి సంబందించిన ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా రామకృష్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులంతా విచ్చేశారు. 

అందరూ ఈ చిత్రం ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోవాలని కోరుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన కథా చర్చలు ఇంకా కొనసాగుతున్నట్టుగా హీరో బాలకృష్ణ, దర్శకుడు తేజ మాటల్లో అర్ధమైంది. అయితే ఈ సినిమాకి సంబందించిన కథని ఒక ఆరు చిత్రాలలో తీయాల్సినంత ఉంది అని అలాంటిది ఇప్పుడు ఒకే సినిమాలోకి కూర్చడానికి సమయం పడుతుంది అని తెలిపారు.

ఇక నిర్మాత విష్ణు, డైరెక్టర్ తేజ మాట్లాడుతూ- #NTRBiopic చిత్రాన్ని ఈ సంవత్సరం దసరాకి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలిపారు. ఇంత తక్కువ సమయంలో ఎలా సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసి విడుదల చేస్తారు అన్న ప్రశ్న అందరిని వేదిస్తున్నది.

మరి వారు కూడా ప్లానింగ్ లేకుండా ఇలాంటి ప్రకటన ఏమి చేయరు అన్న అభిప్రాయం అందరిలోనూ వెలువడుతున్నది. చూద్దాం.. #NTRBiopic ఎప్పుడు విడుదలవుతుందో...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS