'భీష్మ' ట్రైలర్ రివ్యూ

By iQlikMovies - February 17, 2020 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

శ్రీనివాస కళ్యాణం లాంటి అట్టర్ ప్లాప్ మూవీ తరువాత భీష్మ - సింగల్ ఫరెవర్ అంటూ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు మన కొత్త పెళ్ళి కొడుకు నితిన్. తను నటించిన తాజా చిత్రం 'భీష్మ' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎప్పటిలాగే నితిన్ చాలా హ్యాండ్సమ్ గా ఈ ట్రైలర్ లో దర్శనం ఇచ్చాడు. ఫుల్ ఫార్మల్ వేర్ లో కొత్త స్వాగ్ చూపించాడు. ఛలో తో ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుముల మరియు రష్మిక మరోసారి ఈ చిత్రం కోసం కలిసి పనిచేస్తున్నారు.

గ్రాండ్ విజువల్స్ తో ఎక్సట్రార్డినరీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ ట్రైలర్ లో కనిపించాయి. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. వెంకీ తో ఛలో తరువాత మరోసారి కలిసి పనిచేశాడు మహతి. ఇక పోతే ఈ చిత్రంలో నితిన్ సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత వివరించనున్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. ట్రైలర్ లో హీరో విలన్ ను ఉద్దేశించి "9 నెలల్లో పుట్టాల్సిన నువ్వు 6 నెలల్లో పుడితే...నెల తక్కువ వెధవ అంటారు.." అనే డైలాగ్ లో సీరియస్ నెస్, మరియు "యూ పోక్ మి.. ఐ స్క్రాచ్ యూ.." అనే డైలాగ్ లో హ్యూమర్ చూస్తుంటే.. నితిన్ ఈ చిత్రంతో హిట్టు కొట్టటం గ్యారంటీ అనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS