'చెప్పానా.. నేను చెప్పానా..' అంటూ క్యూట్‌గా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన బ్యూటీ అందాల మెహారీన్. గతేడాది వరుసగా ఐదు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి, కుర్రకారును హుషారెత్తించిందీ బ్యూటీ. ప్రస్తుతం గోపీచంద్‌తో 'పంతం' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఇలా వైట్ డ్రస్సులో ఫ్రెష్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనమిచ్చింది. ఈ బ్యూటీ అందగత్తే. కాదని అనలేము. కానీ ఈ ఫోటోలో మరింత క్యూట్‌గా గ్లామరస్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. క్యూట్ సెల్ఫీతో 'సో స్వీట్' అనేలా ఉంది కదూ! వరుస సినిమాలతో అమ్మడు ఫిజిక్‌పై కొంచెం అశ్రద్ద చేసిందట. కానీ ఇప్పుడు కసరత్తులు చేసి, నాజూగ్గా, మరింత గ్లామరస్‌గా మారిపోయిందట అందాల మెహరీన్. 2017లో వరుస సినిమాలు చేసేసిన మెహ్రీన్ గోల్డెన్ బ్యూటీ అనిపించుకుంది. ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ.