కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటేనే ఉన్నదీ ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి అలాగే ఎటువంటి మొహమాటం లేకుండా ఏదైనా మాట్లాడగలిగిన వ్యక్తి కూడా.
ఇక ఈయన వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ఓట్ల రాజకీయాల్లో పాల్గొననున్నాడు అన్న వార్తలు వస్తున్న తరుణంలో స్వయంగా మోహన్ బాభే వీటి పైన వివరణ ఇచ్చారు. తనకి ప్రజలు పడుతున్న బాధల చూస్తూ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఇంటిలో కూర్చోవడం తప్పు అవుతుంది అని చెప్పాడు.
అందుకే త్వరలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నాను అని ఆ సమయంలోనే ప్రజల్లోకి వచ్చి తాను ఏమి చెప్పదల్చుకున్నానో అది చెప్తాను అని తన స్టైల్ లో చెప్పేశాడు. ఇప్పటికైతే ఆయనకి సంబంధించి చెలామణి అవుతున్న వార్తల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించవచ్చు అనేది స్పష్టమవుతున్నది.
చూద్దాం.. కలెక్షన్ కింగ్ ఎటువంటి ప్రభావం చూపబోతున్నాడో అన్నది.