గురు సినిమా విడుదల తరువాత మరో చిత్రానికి ‘ఎస్’ చెప్పకుండా ఇన్ని నెలల పాటు విక్టరీ వెంకటేష్ సైలంట్ గా ఉండిపోయాడు. అయితే మంచి కథ కోసం నిరీక్షించిన వెంకటేష్ కి దర్శకుడు తేజ ఒక మంచి కథ సిద్ధం చేసాడట.
వివరాల్లోకి వెళితే, కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఒక కథని హీరో వెంకటేష్ కి వినిపించాడట తేజ. ఈ కథలో వెంకటేష్ ఒక ప్రొఫెసర్ గా కనిపించనున్నాడని అలాగే ఈయన సరసన యంగ్ హీరోయిన్ మెహ్రీన్ నటించనున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
అయితే కాస్టింగ్ వివరాలు త్వరలోనే తెలియచేస్తాను అని దర్శకుడు తేజ కొద్దిసేపటి క్రితమే వెల్లడించాడు. ఇదిలావుండగా ఈ చిత్రం వెంకటేష్ పూర్వం నటించిన సుందరకాండ చిత్రంలా ఉండబోతున్నది అన్న చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.