మెహరీన్‌.. గ్లామరస్‌గా మెరిసెన్‌!

మరిన్ని వార్తలు

అరవిరిసిన అందమంటే ఇదేనేమో అనిపించట్లే. అవును బ్లూ కలర్‌ డ్రస్సులో మెహరీన్‌ అందాలు అదరహో అనిపిస్తున్నాయి. కాస్ట్యూమ్‌ డిజైన్‌ అద్దిరిపోయింది. నడుం వద్ద ఆ కట్‌, లాంగ్‌ లాంగ్‌ ఫిల్స్‌.. అన్నీ వెరసి మెహరీన్‌ సో క్యూట్‌గా ఉందీ డ్రస్సులో. మొదట్లో కొంచెం బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్లిమ్‌గా మారింది. స్లిమ్‌ ఫిజిక్‌లో మెహరీన్‌ మరింత ముద్దొచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పంతం' సినిమాలో నటిస్తోంది. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాక మెగా కాంపౌండ్‌ హీరో మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్‌ 2' అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమాలో మెహరీన్‌తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS