ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో సీనియర్ హీరోయిన్‌గా చెప్పుకోబడుతుంది స్వీటీ బ్యూటీ అనుష్క. కెరీర్‌లో విచ్చలవిడిగా గ్లామరస్ పాత్రలు చేసేసింది. 'అరుంధతి', 'బాహుబలి', 'భాగమతి' వంటి పర్‌ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలనూ చేసేసింది. అన్నింటికీ మించి ఇక ఇప్పుడు గ్లామర్ పాత్రల్లో అనుష్కని అస్సలు ఊహించుకోలేం. ఇలాంటప్పుడు అనుష్క పెళ్లి చేసుకుని సెటిలైపోవచ్చు కదా.. అని అభిమానులు భావిస్తున్నారు.
ఎప్పటి నుండో అనుష్క పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ, జస్ట్ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి కానీ స్వీటీ పెళ్లి వార్త మాత్రం చెవికి చేరలేదు. అనుష్క తల్లితండ్రులు కూడా ఆమె పెళ్లి కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారట. అరటే అనుష్కకి నచ్చిన వరుడు దొరకడం లేదా? ఏమో తెలీదు. ప్రస్తుతం అనుష్క చేతిలో కొత్త సినిమాలు కూడా లేవు. అలాంటప్పుడు పెళ్లికి వచ్చిన తంటా ఏంటంట? ఈ మధ్య బాలీవుడ్‌లో ముద్దుగుమ్మలు సీనియారిటీతో సంబంధం లేకుండా ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకుని, కెరీర్‌ని కూడా విజయవంతంగా రన్ చేస్తున్నారు. అలాంటిది అనుష్క మాత్రం పెళ్లిని ఎందుకు పక్కన పెట్టిందో తెలీడం లేదు.
అంతెందుకు టాలీవుడ్ విషయానికి వస్తే, సమంత, శ్రియ తదితర ముద్దుగుమ్మలు కూడా పెళ్లి తర్వాత సక్సెస్‌ఫుల్‌గా సినిమాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది చివరికల్లా అనుష్క పెళ్లిపై ఓ క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. చూడాలి మరి మన జేజమ్మ పెళ్లి కబురు ఎప్పుడు చెప్పేనో.!