'కృష్ణ గాడి వీరప్రేమగాధ' సినిమాతో మొదలైన ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ సినీ కెరీర్ మొదట్లో డల్‌గానే సాగింది. తొలి సినిమా విజయం సాధించింది. కానీ తర్వాత ఏడాది వరకూ మెహ్రీన్ పేరు ఎక్కడా వినిపించలేదు. అయితే ఆ తర్వాత వరుస అవకాశాలతో ఎక్కడ విన్నా మెహ్రీనే అనిపించేలా వరుస సినిమాలతో సందడి చేసింది. అలా 'మహానుభావుడు' సినిమా వరకూ ఫుల్ బిజీగా గడిపేసింది మెహ్రీన్.
అయితే వీటిలో ఏ ఒక్కటీ తొలి సినిమా సక్సెస్ ఇచ్చినంత కిక్‌ని మెహ్రీన్‌కి అందించలేకపోయాయి. ఇకపోతే తాజాగా మెహ్రీన్ 'నోటా'లో దర్శనమిచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెహ్రీన్ రిపోర్టర్‌గా కనిపించింది. అయితే ఈ పాత్రను మెహ్రీన్ ఎందుకు ఎంచుకుందో ఎవరికీ తెలియడం లేదు. అస్సలు ప్రాధాన్యతే లేని పాత్ర ఆమెది. స్క్రీన్ మీదికి ఎందుకు వస్తుందో, ఎందుకు వెళుతుందో నటించిన ఆమెకైనా తెలుసా? అనేంతలా ఆ పాత్రకు విలువ లేకుండా పోయింది.
ప్రాధాన్యత లేదు కదా, కనీసం గ్లామర్ కూడా లేని పాత్ర అది. ఇలాంటి పాత్రలో కనిపించేందుకు ఎందుకు ఒప్పుకుందా? అని మెహ్రీన్‌పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ సరసన 'ఎఫ్ 2' చిత్రంలో నటిస్తోంది మెహ్రీన్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోయే ఈ చిత్రంలో వెంకటేష్, తమన్నా మరో జంటగా నటిస్తున్నారు.
ఈ సినిమాలోనైనా మెహ్రీన్‌కి సీనుంటుందో లేదో చూడాలిక.