'నోటా' సినిమా చేసి ఉండకూడదు అని మెహ్రీన్ కౌర్ తెగ ఫీలయిపోతోందట.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'నోటా' సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఆమె పాత్రకు అస్సలు ప్రాధాన్యతే లేదు సినిమాలో. రిపోర్టర్‌గా నటించిన మెహ్రీన్ అస్సలు ఎందుకు స్క్రీన్‌పైకి వస్తుందో ఎందుకు వెళ్లిపోతోందో తెలియని అయోమయంలో ఆడియన్స్ ఉన్న పరిస్థితి.
అందుకే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను ప్రశ్నలతో విసిగిస్తున్నారట. అసలేముందని ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నావు..? అని ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదట మెహ్రీన్‌కి. దాంతో చాలా చాలా ఫీలయిపోతోందట. గతంలోనూ ఓ సినిమాకి మెహ్రీన్ ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసింది. అయితే అది తమిళంలో. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'కేరాఫ్ సూర్య' సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. అయితే సినిమా విడుదలయ్యాక నిడివి ఎక్కువైందన్న ఆడియన్స్ రిపోర్ట్స్ అందుకున్న చిత్ర యూనిట్ పాపం మెహ్రీన్ సీన్స్ అన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కత్తిరించేశారు.
ఆ టైంలో మెహ్రీన్ ఎంత బాధపడిందో పాపం ఆమెకే తెలుసు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగులో ఆ రకమైన బాధనే ఫీలవుతున్నానని మెహ్రీన్ చెబుతుంటే, ఆమె అభిమానులు సర్లే మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2' సినిమా ఉంది కదా అని ఆమెకు ధైర్యం చెబుతున్నారట. సంక్రాంతికి 'ఎఫ్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.