హనీ పాప ఇప్పుడేం చేస్తోందో తెలుసా.!

మరిన్ని వార్తలు

'హనీ ఈజ్‌ ద బెస్ట్‌..' అటూ బెస్ట్‌ హిట్‌ కొట్టేసింది ముద్దుగుమ్మ మెహ్రీన్‌ 'ఎప్‌ 2' సినిమాతో. ఈ సినిమా హిట్‌తో మెహ్రీన్‌కి అవకాశాలు పోటెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాల వరకూ ఉన్నాయి. యంగ్‌ హీరో నాగశౌర్యతో ఓ సినిమాలోనూ, లేటెస్ట్‌గా కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమాలోనూ మెహ్రీన్‌ నటిస్తోంది. ఆరడుగుల ఆజానుబాహుడు హ్యాండ్‌సమ్‌ గై గోపీచంద్‌తో రెండోసారి జత కడుతోంది. త్వరలో బాలీవుడ్‌కీ వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సంగతి అలా ఉంచితే, డాన్సుల్లో మెహ్రీన్‌ కాస్త వీక్‌ అన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ యాక్ట్‌ చేసిన పలు చిత్రాల్లో ఆ వీక్‌పాయింట్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయిపోయింది. అదే వీక్‌ పాయింట్‌ని ఆసరాగా తీసుకుని 'ఎఫ్‌ 2'లో హనీ పాత్రకు మెహ్రీన్‌ని ఏరి కోరి ఎంచుకోవడం జరిగింది. తన వీక్‌ పాయింటే తనకు ప్లస్‌ అయ్యింది ఆ సినిమాకి. అది వేరే విషయం. అయితే ఆ వీక్‌పాయింట్‌ని జయించాలనుకుంటోందట.

 

ప్రస్తుతం డాన్సుల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట. స్పెషల్‌గా ఓ డాన్స్‌ మాస్టర్‌ని నియమించుకుని మెహ్రీన్‌ డాన్స్‌లో శిక్షణ తీసుకుంటోందనీ తెలుస్తోంది. ఓ వైపు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోన్న మెహ్రీన్‌ డాన్సులు నేర్చుకోవడానికీ టైం కేటాయిస్తుండడంతో, నటనలో మరింత రాణించాలనే ఆమె తపన ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. గతంలో డాన్సులు విషయంలో ముద్దుగుమ్మ కత్రినాకైఫ్‌ కూడా పలు విమర్శలు ఎదుర్కొంది. కానీ, ఇప్పుడు కత్రినా డాన్సులకు ఎంతటి వారైనా ఫిదా కావల్సిందే. ఏమో అలాగే మెహ్రీన్‌ కూడా ముందు ముందు డాన్సుల్లో తనకు తానే సాటి అనే రేంజ్‌కెళుతుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS