'శ్రధ్ద'గా బాధ్యత తీసుకుంది!

మరిన్ని వార్తలు

'సాహో' సినిమాతో బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ తెలుగు తెరకు పరిచయమవుతోంది. బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా గడుపుతోన్న శ్రద్ధాకపూర్‌ సౌత్‌ ఎంట్రీ అంటే చాలా చాలా స్పెషల్‌గా ఉండాలి. అందుకే హీరోయిన్‌ పాత్రను చాలా బలంగా తీర్చిదిద్దాడట డైరెక్టర్‌ సుజిత్‌. సినిమాకి అత్యంత కీలకమే కాకుండా, సినిమాని మలుపు తిప్పే పాత్ర హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్‌ది. స్టోరీ మొత్తం శ్రద్ధా పాత్ర చుట్టూనే తిరుగుతుందని టీజర్‌ ద్వారా అర్ధమయ్యేలా చెప్పేశారు 'సాహో' టీమ్‌. తన పాత్ర గురించి చెప్పగానే శ్రద్ధా కపూర్‌ వెంటనే ఓకే చేసేసిందట. ఆ పాత్రలోని డెప్త్‌ అలాంటిది మరి. హీరోతో పాటు సమానంగా యాక్షన్‌ సీన్లు ఇరగదీయాల్సి వచ్చిందట. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న శ్రద్ధాకపూర్‌ ఈ సినిమా కోసం తొలిసారి ఆ స్థాయిలో కష్టపడిందట.

 

తన సీన్లు నేచురల్‌గా రావడానికి సెట్స్‌లో ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదని డైరెక్టర్‌గా దగ్గర నుండి చూసిన సుజిత్‌ చెబుతున్నారు. అలాగే అంత అనుభవం ఉన్నప్పటికీ, ఆమె కమిట్మెంట్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటున్నాడు. అంతులేని కష్టాల్లో ఉన్న హీరోయిన్‌ని అనుక్షణం కాపాడే ధైర్యవంతుడు, సాహసవంతుడిగా హీరో క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేసి, 'సాహో'తో ప్రబాస్‌ రేంజ్‌ మరోసారి పెంచేశాడు సుజిత్‌. అయితే, హీరోయిన్‌కి కష్టాలు.. ఆ కష్టాల నుండి కాపాడే హీరో.. ఇలా ఈ తరహా స్క్రిప్టుల్లో చాలా సినిమాలే వచ్చినా, దానికి భారీ యాక్షన్‌ అంశాల్ని థ్రిల్లింగ్‌ జోనర్‌లో జోడించి యావత్‌ ఇండియన్‌ సినిమా దృష్టిని 'సాహో' వైపు తిప్పేసిన యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ డైరెక్టర్‌ సుజిత్‌ సాహసాన్ని కూడా మెచ్చుకుని తీరాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS