పోలీస్ పాత్రలంటే హీరోలకు మక్కువ ఎక్కువ. మాస్‌ని ఈజీగా మెప్పించడానికి ఇదో మార్గం. ఇలాంటి పాత్రలతోనే చాలామంది హీరోలు మాస్‌కి దగ్గరయ్యారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. కిరణ్ హీరోగా మైత్రీ మూవీస్‌సంస్థ ఓ చిత్రం నిర్మిస్తోంది. అదే.. మీటర్. ఇందులో కిరణ్ పోలీస్‌పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ ఆవిష్కరించారు. 2 నిమిషాల 18 సెకన్ల ట్రైలర్ ఇది. మాస్, యాక్షన్ ప్యాక్డ్ గా సాగింది.
''చేత్తో కొట్టావా? ఫ్లవర్ తో కొట్టావా, ఇంత సున్నితంగా ఉంది..''
''గంప దాటిన కోడి పిల్ల.. గడప దాటిన ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దొరికితే బిర్యానీ అవుతుంది.. నువ్వు దొరికితే బత్తాయి అవుతావు...''
''భగవంతుడు ముందు భక్తితోనూ బలవంతుడి ముందు భయంతోనూ ఉండాలి.. అంటూ విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు''
''కుర్రనాకొడుకును.. దింపడం అంటూ మొదలెడితే. ఎంత లోతుకు దింపుతానో నాకే తెలీదు...''
లాంటి డైలాగులు ఈ ట్రైలర్‌లో కనిపించాయి. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ బాగుంటుంది. దానికి తగ్గట్టుగానే తన క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. యాక్షన్ సీన్లలో పంచ్ డైలాగులు, ఆ ఎలివేషన్లూ.. బాగా కుదిరినట్టు అనిపిస్తోంది. ఏ హీరోకైనా.. ఓ మంచి మాస్ సినిమా పడితే... ఇమేజ్ మారిపోతుంది. కిరణ్ కూడా ఈ సినిమా నుంచి అదే ఆశిస్తున్నాడు. మరి.. ఏమవుతుందో చూడాలి.