కమర్షియల్‌ మూవీస్‌ కష్టమంటోన్న మిల్కీబ్యూటీ.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌ పాత్రలతో ఆకట్టుకుని, కమర్షియల్‌ హీరోయిన్‌గా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకున్న ముద్దుగుమ్మ తమన్నా. రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌.. పలువురు స్టార్‌ హీరోలతో నటించి పలు హిట్లు, సూపర్‌ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సీనియర్‌ హీరో వెంకీతో తొలి సారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుని గుర్తుండిపోయే హిట్‌ కొట్టింది. ఇక ఇప్పుడు తమన్నా నుండి రాబోతున్న సినిమాలు హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీసే. 

 

త్వరలోనే 'అభినేత్రి 2'తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా. ఈ సినిమాలో ప్రభుదేవా హీరోగా నటిస్తున్నాడు. కథ మొత్తం తమన్నా చుట్టే తిరుగుతుంది ఈ సినిమాలో. మరో మూవీ 'దటీజ్‌ మహాలక్ష్మి'. బాలీవుడ్‌ క్వీన్‌కి తెలుగు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా కూడా అతి త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఇందులోనూ తమన్నా విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. పర్‌ఫామెన్స్‌కి బాగా స్కోపున్న చిత్రమిది. గోదారి జిల్లా యాసలో మాట్లాడుతూ తమన్నా బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. 

 

ఇదిలా ఉంటే, ఒకప్పుడు కమర్షియల్‌ హీరోయిన్‌గా సక్సెస్‌ అందుకోవడానికి చాలా కష్టపడిన తమన్నా, ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. అయితే కమర్షియల్‌ హీరోయిన్‌ అనిపించుకోవడానికే చాలా చాలా కష్టపడాలి అంటోంది. కమర్షియల్‌ హీరోయిన్‌ అనిపించుకునే క్రమంలో రకరకాల ప్రాబ్లెమ్స్‌ని ఫేస్‌ చేయాలని, అవన్నీ తట్టుకుని గట్టెక్కడం అంత తేలికైన విషయం కాదనీ తమన్నా చెప్పుకొస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS