అందమైన దెయ్యానికి ఈ సారైనా కలిసొచ్చేనా.?

By Inkmantra - April 12, 2019 - 14:30 PM IST

మరిన్ని వార్తలు

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ నందితా శ్వేత. తొలి సినిమాతోనే దెయ్యం పాత్రలో కనిపించి, మెప్పించింది. దెయ్యం పాత్రలో నందితా చాలా ఇంపాక్ట్‌ చూపించింది. ఓహో ఆ దెయ్యం పాపా.. అనేంతగా అంత త్వరగా మర్చిపోనివ్వలేదు ఆ పాత్రతో నందిత. ఆ తర్వాత 'శ్రీనివాస కళ్యాణం' తదితర సినిమాల్లో నటించింది కానీ, అవేమీ డెబ్యూ చిత్రంలా చెప్పుకోదగ్గ సంతృప్తినివ్వలేదు అమ్మడికి. 

 

ఇటీవల మళ్లీ దెయ్యం పాత్రతోనే వచ్చింది 'ప్రేమ కథా చిత్రమ్‌ 2'తో. విడుదలకు ముందు బాగా ఆకట్టుకున్న ఈ చిత్రమ్‌ విడుదలయ్యాక అంచనాల్ని అందుకోలేకపోయింది. కానీ నందితాకి సేమ్‌ నేమ్‌ వచ్చింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారీ దెయ్యంగానే కనిపించనుంది 'రూబీ'గా. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదా. అవును ప్రభుదేవా, తమన్నా జంటగా తెరకెక్కిన 'అభినేత్రి'లో. ఆ అభినేత్రికి ఇప్పుడు సీక్వెల్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 

 

'అభినేత్రి' మంచి సక్సెస్‌ అందుకున్న దర్మిలా ఈ సీక్వెల్‌పైనా మోస్తరు అంచనాలున్నాయి. అయితే తొలి పార్ట్‌లో తమన్నానే రూబీ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆ రూబీ పాత్రను నందితా శ్వేత పోషిస్తోందని తెలుస్తోంది. అంటే 'అభినేత్రి 2' నందితాకి కలిసొస్తుందనిపిస్తోంది. ఆల్రెడీ తమిళంలో విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తొలి పార్ట్‌ కన్నా ఈ పార్ట్‌ మరింత ఆశక్తిగా అనిపిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది 'అభినేత్రి 2'.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS