ఆమె ఓ హీరోయిన్. తెలుగులో అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు చేసింది. ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది. హుషారైన పిల్ల. ఇప్పుడు ఆమెకు ఓ ఖరీదైన కానుక దక్కిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదీ ఓ మంత్రిగారి దగ్గర్నుంచి. ఆ కథానాయికకు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉంది. కొంతమంది రాజకీయ ప్రముఖులతో ఆమెకు పరిచయం ఉంది. ఇప్పుడు ఓ రాజకీయ ప్రముఖుడు, ఓ మంత్రి.. ఈ కథానాయికకు ఓ ఖరీదైన ఫ్లాట్ కానుకగా ఇచ్చాడని సమాచారం.
ఇది వరకే ఈ కథానాయిక హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుక్కుంది. అప్పుడు కూడా.. తనకు ఆ ఇల్లు ఓ కథానాయకుడు బహుమతిగా ఇచ్చారని చెప్పుకున్నారు. ఇప్పుడు అదే కథానాయికపై మరో రూమర్ అన్నమాట. మరి అందులో నిజం ఎంతుందో తెలీదుగానీ, త్వరలోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయడానికి హీరోయిన్‌గారు రెడీ అవుతున్నారని టాక్. మరి ఆ శుభకార్యానికి మంత్రిగారు వస్తారో రారో చూడాలి.